మహిళా శక్తికి నిదర్శనం ఇందిరాగాంధీ
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రములో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఘనంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించు కున్నారు. సాధారణ మహిళ అసాధారణ శక్తిగా ఎదుగుటకు ఇందిరాగాంధీ ప్రస్థానమే నిదర్శనమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు.మాజీ ప్రధాని, ఉక్కు మహిళ దివంగత ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి మాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఓ మహిళగా ఎన్నో ఒడిదుడుకు లను ఎదుర్కొని, పేదల నిర్మూలనకు మహిళల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనే విధంగా విశ్వఖ్యాతిని గడించారని అభిప్రాయ పడ్డారు. నేటి తరంలో సుపరిపాలన అంటే ఇందిరమ్మ రాజ్యం అనే నినాదం చొచ్చుకు పోయిందని పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం తన ప్రాణాల ను సైతం విడిచారని గుర్తు చేసుకున్నారు. ఇందిరా ఆశ యాలకు అనుగుణంగా కాంగ్రె స్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిందం రవి, బాసని శాంత, మారపల్లి కట్టయ్య, బాసని మార్కండేయ, దుబాసి కృష్ణమూర్తి రవి పాల్ భాస్కర్ ప్రపంచ రెడ్డి వలి ఐదర్ మరేపల్లి రాజేందర్, వరదరాజు, నరేష్ రెడ్డి, శంకరా చారి, రాజు తదితరులు పాల్గొన్నారు.