Former MPP Soyam Krishna Veni Joins Congress Party
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ సోయం కృష్ణ వేణి
సిపిఎం సీనియర్ నాయకులు రాంపండు
నేటిదాత్రి చర్ల
చర్ల మండలంలోని సీనియర్ రాజకీయ నాయకురాలు మాజీ ఎంపీపీ సోయం కృష్ణవేణి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రాంపండు శుక్రవారం అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు మంత్రి పొంగులేటి ఆసిస్సులతో భద్రాచలం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి చేరుతున్నట్లు తెలిపారు 5 ఏళ్లపాటు ఎంపీపీగా పనిచేసి ప్రజా అభివృద్ధే ధ్యేయంగా నడుచుకున్న మాజీ ఎంపీపీ సోయం కృష్ణ వేణికి పరిసర గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని ప్రజల మన్ననలు పొందినారు
సీపిఎంలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన రాంపండు అటవీ గ్రామాలయినా కుర్నపల్లి ఎర్రబోరు బోధనేల్లి సత్యనారాయణపురం అర్ కొత్తగూడెం కలివేరు అభివృద్ధిలో కీలకంగా వ్యవరించారు ప్రజలు సైతం నేటికీ రాంపండు వెంటే ఉంటూ తమ సమస్యలను పరిష్కరించే నాయకుడి వెంట నడుస్తున్నారు ఈ ఇద్దరి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది వీరితో పాటు చర్ల మాజీ వార్డు మెంబర్ కూర సుజాత కూడా జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకులు చీమలమర్రి మురళి పోలిన లంక రాజు పోట్రూ బ్రేమ్మానంద రెడ్డి ముమ్మినేని అరవింద్ మద్దరాజు నరసింహారాజు పాల్గొన్నారు
