ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనా చారి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డ ఈద్గలో ముస్లిం మైనారిటీ తో ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అనంతరం మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అలాగే బిఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ విద్యార్ధిని విద్యార్థుల కోసం వారి చదువుల అభ్యున్నతికోసం ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు నిర్మాణం చేశారు. ప్రతి రంజాన్ పండుగకు అందరికీ దుస్తువులు ఇఫ్తార్ విందు కార్యక్రమాలు ఇచ్చేవారు అంతే కాకుండా వారి కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి వారి సంక్షేమానికి పెద్దపీట వేశారు అదంతా మీరు కళ్లారాచూశారు కనివిని ఎరుగని రీతిలో అన్నింటా పురోగతి సాధించాలనే సదుద్దేశంతో కేసీఆర్ ముందుకు నడిచారు మన జిల్లా కేంద్రంలోని నా వంతు పాత్ర పోషించి గతంలో మీ కోసం ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పటానో మీరు చూశారు… రానున్న మన బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో పెదవారికోసం అనేక ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేవిధంగా కృషి చేస్తాం అని తెలుపుకుంటూ నెల రోజుల నుండి ఎంతో భక్తిపవిత్రతతో పెద ధనిక అని అని బిన్న అభిప్రాయాలు లేకుండా మంచి మనస్తత్వంతో ఇన్ని రోజులు ఉపవాసాలు ఉండి ఓకె దగ్గర ఈ పండుగ వాతావరణం జరుపుకోవడం చాలా సంతోషంగా ఈ కార్యక్రమానికి పాల్గొని మిమ్మల్ని కలిసిందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మరొక్క మారు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. తెలిపారు