నేటిధాత్రి, వరంగల్ తూర్పు
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిధర్ రావు, వరంగల్ తూర్పు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త బస్వరాజు రాజ్ కుమార్ ఈమధ్య అస్వస్థత గురై ఇంట్లోనే విశ్రాంతి తీసుకొంటున్న విషయం తెలుసుకొని, బస్వరాజు సారయ్య గల్లీ, పోచమ్మమైదాన్ లో నివాసం ఉంటున్న రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజ్ కుమార్ ఆరోగ్య బాగోగులపై అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి బరోసా కల్పించారు. మరోసారి వరంగల్ తూర్పులో కార్యకర్తలకు అండగా నిలిచారు అనే చెప్పొచ్చు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన 25వ డివిజన్ ముఖ్య కార్యకర్తలను రాజ్ కుమార్ చేతుల మీదుగా శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజు, కొత్తపల్లి శ్రీనివాస్, తోట వేణు, లవణ్, సోహేల్, సాంబయ్య, మల్లేశం, తోట రాణి, రజనీ, స్వప్న, విజయ తదితరులు పాల్గొన్నారు.