పరకాల నేటిధాత్రి
స్థానిక పరకాల పట్టణంలోని మోలుగురి బిక్షపతి నివాసంలో పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి చంద్రకళ బిక్షపతి వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని దంపతులను సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేసిన పరకాల పట్టణ కాంగ్రెస్ నాయకులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల పట్టణంలోని పేద ప్రజలకు రాజకీయ రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మంచి పరిపాలన దిశలో పరకాల అభివృద్ధికి పాటుపడాలని వారు ఎమ్మెల్యేగా గతంలో మంచి పనులు చేసినటువంటి వారు ఎన్నో మంచి పనులు చేస్తున్నటువంటి మొలుగురి చంద్రకళ బిక్షపతి దంపతులు చిరకాలం ప్రజల మధ్యలో మదిలో ఉంటారని,మనస్ఫూర్తిగా ఇలాంటి పెళ్లి రోజులు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి పరకాల ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,కాంగ్రెస్ నాయకులు చెరుపెల్లి మొగిలి,ఒంటేరు వరుణ్, బొచ్చు జెమిని,ఒంటేరు రవికుమార్,బొచ్చు అనిల్, ఒంటేరు సుధాకర్,బొచ్చు సంపత్ బొచ్చు అఖిల్, పాల్గొన్నారు.