రాజకీయ లబ్ధి కోసమే మాజీ ఎమ్మెల్యే ధర్నా..

Former MLA's dharna is for political gain..

రాజకీయ లబ్ధి కోసమే మాజీ ఎమ్మెల్యే ధర్నా..

రైతులు ఆందోళన చెందవద్దు… పంటలకు రక్షణగా ఉంటాo

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి రాజకీయ లబ్ధి కోసమే రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ధర్నా పేరుతో దివాలా కోరు రాజకీయాలు చేస్తున్నా డని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని చలివాగులో పరివాహక ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే ధర్నా నిర్వహించిన నేపథ్యంలో మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల తో కలిసి బుచ్చిరెడ్డి మాట్లా డుతూ రైతులు బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, వరి పంటలకు కాంగ్రెస్ మండల నాయకులు రక్షణగా ఉంటారని భరోసా ఇచ్చారు. భూగర్భ జలాలు అడుగంటిన తరుణంలో చలివాగులో నీటి లెవెల్స్ తగ్గడం జరిగిందని, అందుకు రైతులకు ఇబ్బంది కలగకుండా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు ఆదేశాలతో అధికా రులపై ఒత్తిడి తీసుకువచ్చి నీటి లిఫ్టింగ్ నిలిపివేయించడం జరిగిందని గుర్తు చేశారు. చలివాగు కాలువలమరమ్మత్తు లు జరుగుతున్న తరుణంలో క్రాప్ హాలిడే ప్రకటించినప్పటికీ రైతుల విజ్ఞప్తి మేరకు జాలు కాలువ ద్వారా నీటిని విడుదల చేసి చిత్తశుద్ధిని చాటుకున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉండగా చలివాగును అడ్డు పెట్టుకొని చాపల వ్యాపారం చేశారని, ప్రాజెక్టులో 15 ఫీట్లు మినిమం నీరు ఉండేలా కట్ట ఎత్తుగా పోయిస్తానని హామీ ఇచ్చి గెలిచాక విస్మరించారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చలివాగులో నీటి లెవెల్స్ తగ్గిపోయినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు ధర్నా చేస్తే అక్రమ కేసులు నమోదు చేయించిన హీన చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. ఉనికి కోసం రైతులను ఆందోళనకు గురి చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిందం రవి, వలి హైదర్, దుబాసి కృష్ణమూర్తి, వైద్యుల వెంకటరాజు రెడ్డి, ఆదిరెడ్డి, లడే రాజ్ కుమార్, ఐలయ్య, కట్టయ్య, మార్కండేయ, డిటి రెడ్డి, బాసవి రవి, సదయ్య, జక్కుల నరేష్, రాజు, జగన్, రాజయ్య, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!