Former MLA Consoles Bereaved Families
మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది
నర్సంపేట,నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి, పోగుళ్ళపల్లి, కొత్తగూడ గ్రామాలలో ఇటీవల మరణించిన పలు కుటుంబాలను నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఓటాయి గ్రామంలో స్వైరో జిల్లా నాయకులు చింత సదానందం వారి తల్లి చింత లక్ష్మి ఇటీవల మరణించగా వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే పోగుళ్ళపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మనబోయిన మల్లయ్య వారి భార్య కొమ్మనబోయిన లక్ష్మీ కిడ్నీ వ్యాధితో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.అదేవిధంగా కొత్తగూడ గ్రామ పార్టీ అధ్యక్షుడు దారం సమ్మయ్య కుమారుడు దారం రాహుల్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఒడిసిఎంఎస్ వైస్ చైర్మన్, మండల పార్టీ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
