నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ రుద్ర మళ్లీశ్వరీ – ఓం ప్రకాష్ కోడలు ఇటీవల అమెరికాలో మరణించగా అమే మృతి పట్ల నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెంకటనారాయణ గౌడ్,మాజీ ఎంపీపీ నల్ల మనోహర్ రెడ్డి,మండల పార్టీ ఉపాధ్యక్షులు నామాల సత్యనారయణ, కౌన్సిలర్లు, క్లస్టర్ భాద్యులు, తదితరులు ఉన్నారు.