నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలోని రేలకుంట గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు రసపుత్ర రాజు భార్య అంగన్వాడి టీచర్ నిర్మల అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతురాలి స్వగృహానికి చేరుకొని ఆమె పార్థివదేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, పిఎసిఎస్ చైర్మన్ మురళీధర్, మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగాచారి, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, నాయకులు భూక్య రాజు నాయక్, శివాజీ, జూనూరి అశోక్ గౌడ్, కందకట్ల వెంకటేశ్వర్లు, ఎల్లబోయిన రాంబాబు, గుగులోతు సారయ్య తదితరులు పాల్గొన్నారు.