# పాడెమోసిన ఎన్నారై రాజ్ కుమార్..
# దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్వర్యంలో సంతాపం..
నర్సంపేట,నేటిధాత్రి :
దుగ్గొండి మండలంలోని రేబల్లే గ్రామంలో గల అరుణోదయ పురుషుల పొదుపు సంఘం అధ్యక్షులు సోలెంకి రాజేందర్(38) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు.ముందుగా చికిత్స నిమిత్తం అంబులెన్స్ కు సమాచారాన్ని కుటుంబ సభ్యులు ఇవ్వగా అంబులెన్స్ వచ్చే లోపే ఆయన మృతి చెందాడు.పొదుపు సంఘాల స్వ కృషి ఉద్యమంలో ప్రజలకు సేవలు చేస్తున్న రాజేందర్ అకాల మరణం ఆ సంఘానికి తీరని లోటుగా గ్రామస్థులు భావిస్తున్నారు.రాజేందర్ మృతి పట్ల సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులు బార్య రజిత, కుమారుడు సాత్విక్,కూతురు శరణ్యలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మాజీ ఎమ్మెల్యే వెంట జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, బిఅర్ఎస్ దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు సొసైటీ చైర్మన్ సుకినె రాజేశ్వర్ రావు,మాజీ సర్పంచ్ మేరుగు రాంబాబు ఉన్నారు.
# పాడెమోసిన ఎన్నారై రాజ్ కుమార్..
రేబల్లే గ్రామంలో గల అరుణోదయ పురుషుల పొదుపు సంఘం అధ్యక్షులు సోలెంకి రాజేందర్ మృతి పట్ల బిఅర్ఎస్ పార్టీ నియోజకవర్గ యూత్ కన్వీనర్,ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్న రాజ్ కుమార్ మాజీ సర్పంచ్ రాంబాబుతో కలిసి మృతదేహం పాడెమోశారు.
# దుగ్గొండి పొదుపు సమితి అధ్వర్యంలో సంతాపం…
దుగ్గొండి పురుషుల పొదుపు సమితి దుగ్గొండి పరిధిలోని రేబల్లే సంఘం అధ్యక్షుడుగా 2018 సంవత్సరం నుండి నేటి వరకు విధులు నిర్వహిస్తున్న రాజేందర్ గుండెపోటుతో మృతిచెందడం పట్ల సమితి పాలకవర్గం తీవ్ర దిగ్భ్రాంతికి గురైనారు.కాగా సమితి పరిధిలోని సంఘాల అధ్యక్షులు,గణకులు రాజేందర్ మృత దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళిలు అర్పించారు.బార్య రజిత, కుమారుడు సాత్విక్,కూతురు శరణ్యలతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్, ఉపాధ్యక్షులు కందికొండ రవీందర్, సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నీల రవీందర్,
సమితి పాలకవర్గ సభ్యులు గంగిడి రాజిరెడ్డి,కందుల శ్రీనివాస్ గౌడ్, కడివెండి సత్యనారాయణ, రాయరాకుల రమేష్,పెద్దిరెడ్డి మహేందర్ రెడ్డి,ముదురుకోల నరసయ్య, పోలోజు లింగమూర్తి, బాబురావు,సమితి ఘణకులు పోలోజు రమణాచారి, ఆయా సంఘాల ఘణకులు దిడ్డి రవి, ఆకుతోట పూర్ణ చందర్, నూటెంకి సతీష్, నల్లబెల్లి సుమన్, పొగాకు సదయ్య, మహమ్మద్ హఫీజ్ తో పాటు అరుణోదయ పురుషుల పొదుపు సంఘం ఉపాధ్యక్షుడు వేములపల్లి బాబు,పాలకవర్గం వేములపల్లి శ్రీను,పూర్ణచందర్,కిషన్ రావు,జి.శ్రీను,మల్లేశం,శ్రీనివాస్,నర్సింహారాములు,కుమారస్వామి,యాకూబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.