నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
దుగ్గొండి మండలంలో శనివారం జరిగిన పలు వివాహాది శుభకార్యాలకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వెంకటాపురం గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఊరటి రవి – ఉపేంద్ర దంపతుల కుమారుడు ప్రేమ్ చందర్ రెడ్డి – సింధుల రిసెప్షన్ వేడుకకు అలాగే బిక్కాజిపల్లి గ్రామం బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపిటిసి గాదం ప్రమీల – చంద్రమల్లు దంపతుల కుమారుడు హరీష్-శ్రీ నవ్యల వివాహ రిసెప్షన్ వేడుకకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈకార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు సుకీనే రాజేశ్వర్ రావు, నియోజకవర్గ యూత్ కన్వీనర్,ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్ , ఎంపిపి కోమల భద్రయ్య,ప్రాథమిక వ్యవసాయ సొసైటీ చైర్మన్ ఊరటి మైపాల్ రెడ్డి, ఎంపిటిసిలు, తాజా మాజీ సర్పంచ్ లు, పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ భాద్యులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.