# అరెస్టును ఖండించిన తెలంగాణ ఉద్యమ నేత, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెద్ది
#11 నెలల కాంగ్రెస్ పాలనలో ఎంతోమంది జర్నలిస్టులపై అక్రమ కేసులు
# రంజిత్ ను విడుదల చేసి అక్రమ కేసులను ఎత్తివేయాలి
# మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్..
హైదరాబాద్/నర్సంపేట,నేటిధాత్రి :
జర్నలిస్ట్,వైఆర్ టీవీ చైర్మన్ యార రంజిత్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమ నేత భారత్ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రకటించారు.అరెస్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ,దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన వైఆర్ టీవీ చైర్మన్, జర్నలిస్టు రంజిత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే తప్పు ఏంటి అని ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే స్థాయిని మరిచి అసభ్య పదజాలం వాడుతున్నాడు సిఎం పైన ఎలాంటి కేసులు పెట్టాలి, ఎ విధంగా శిక్షించాలి అని ఎద్దేవా చేశారు. ప్రశ్నించేవారు అంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత భయం అని పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు.రాష్ట్రంలో ఎవరు ప్రశ్నించిన వాళ్లపై అక్రమ కేసులు పెడుతూ,దాడులు చేస్తున్నారు ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని ప్రశ్నించారు.
మీ కాంగ్రెస్ ప్రభుత్వ 11 నెలల పాలనలో ఎంతోమంది జర్నలిస్టుల పైన అక్రమ కేసులు నిత్యకృత్యమయ్యాయని పెద్ది ఆరోపించారు.ముఖ్యమంత్రి చేసే దద్దమ్మ పనులను నిడదీసినందుకే రజిత్ ను నిర్బంధించారు..వెంటనే రంజిత్ ను విడుదల చేసి అక్రమ కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.