మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి,జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి .ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు,వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
జడ్చర్ల మండలం మాచారం గ్రామంలో చలివేంద్రం ప్రారంభించారు. అనంతరం జడ్చర్ల మండలం కొడ్గల్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త నయీం ను పరామర్శించి,
పెద్ద ఆదిరాల గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు.
నసురుల్లబాద్ గ్రామంలో వివాహ కార్యక్రమంలో పాల్గొని
బూరుగుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ను పరామర్శించారు. అనంతరం మిడ్జీల్ మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.