
కారేపల్లి నేటి ధాత్రి
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కారేపల్లి మండల కార్యాలయం కు అమరుడు గండి యాదన్న భవన్ గా నామకరణ చేసి శనివారం నాడు మండల కేంద్రంలో ఆఫీస్ నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పాల్గొని కార్యాలయ స్థలంలో ఎర్రజెండాని ఆవిష్కరించి కార్యాలయానికి యాదన్న స్మారక భవన్ గా పేరు నామకరణం చేశారు .ఈ సందర్భంగా గుమ్మడి నరసన్న మాట్లాడుతూ కామ్రేడ్ యాదన్న దశాబ్దాల కాలం పాటు ఈ ప్రాంత ప్రజల దైనందిన సమస్యలపై ఎన్నో పోరాటాలు నిర్వహించాడని అనేకమందికి అండదండగా ఉన్నారని ఆయన స్మారకంగా ఆఫీస్ నిర్మాణం ఎంతో ఆనందదాయకమని ఆయన అన్నారు . ప్రజ సమస్యలపై పోరాట కేంద్రంగా వర్ధిల్లాలని ఆయన అభిలాషించారు. యాదన్న పేరిట స్మారక భవన్ కు స్థలాన్ని దానంగా ఇచ్చిన బాలు కు ఆయన విప్లవ వందనాలు తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని ప్రజల తరఫున నిజాయితీగా పోరాడేందుకు ఇవాళ కమ్యూనిస్టుల అవసరమని ఇలాంటి కమ్యూనిస్టులకు ఒక కేంద్రం కూడా అవసరమని ఈ విప్లవ కేంద్రం నుండి మండల ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించేందుకు అణువుగా మారాలని ఈ బిల్లింగ్ నిర్మాణానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆదుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు ఈ యాదన్నస్మారక భవనం నుండి మండలంలో ఉన్న ప్రజలందరికీ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాల కేంద్రంగా అభివృద్ధి కావాలని అన్నారు. యాదన్న జీవితాంతం అట్టడుగు వర్గాల ప్రజల కోసం తన జీవితాన్ని ఆరోగ్యాన్ని కుటుంబాన్ని సైతం వదిలి పని చేశాడని ఆయన చేసిన త్యాగం మరవకుండా మనందరం ప్రజల తరఫున పనిచేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో చంద్ర అరుణ ఆవుల వెంకటేశ్వర్లు ఆవుల అశోక్ నాయని రాజు ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ శివలింగం జాటోత్ కృష్ణ గుమ్మడి సందీప్ రాకేష్ వడ్డే వెంకటేశ్వర్లు తేజ నాయక్ సత్తిరెడ్డి వీరన్న గుమ్మడి సరోజిని సత్తిరెడ్డి నాగేశ్వరరావు యాకోబు షావలి యాదన్న కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.