
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు శాంతి నగర్ లోని సుభాష్ కాలనీలోని బేస్తల్ ఇవాంజెలికల్ ప్రార్ధన మందిరంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు
ఈ సందర్భంగా కేకు కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏసుక్రీస్తు జన్మించిన ఈ పవిత్రమైన రోజున ఆ ఏసుక్రీస్తు యొక్క ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని క్రైస్తవ సోదరీ, సోదరులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్య్రమంలో భూపాలపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ సెగ్గం వెంకట రాణి సిద్దూ, పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, మున్సిపల్ వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి, ప్లోర్ లీడర్ నూనె రాజు, కౌన్సిలర్స్ జక్కం రవి, ముంజంపల్లి మురళి, పట్టణ ప్రధాన కార్యదర్శి బి బి చారి, సీనియర్ నాయకులు నాగుల దేవేందర్ రెడ్డి, కోడిగుడ్ల రాములు,పింగిలి రవీందర్ రెడ్డి,వార్డు అధ్యక్షుడు వెన్నంపల్లి కృష్ణమూర్తి, తిరుపతి,గండ్ర యువసేన నాయకులు శ్రీకాంత్ పటేల్, యూత్ నాయకులు ఆకుదారి మనోహర్,బానోత్ మహేష్, భూక్యా హరీష్,శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు