
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు భారత మాజీ ప్రధాని, డా. మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళులార్పించి, సంతాపం ప్రకటించిన భూపాలపల్లి మాజీ ఏమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జీఎంఆర్ఎం ట్రస్ట్ సీఈఓ గండ్ర గౌతమ్ రెడ్డి
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో వున్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు గారు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడుగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు.
పీవీ నర్సింహా రావు నమ్మకాన్ని నిలబెట్టి వారి మనసు గెలిచిన వ్యక్తి మన్మోహన్ సింగ్
భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది.
తెలంగాణ ఉద్యమాన్ని,ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేసుకున్నారు.
ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్భంగా వారందించిన మద్దతును, చేసిన కృషిని తెలంగాణ సమాజం గుర్తుంచుకుంటుందని అన్నారు.
మిత భాషిగా, అత్యంత సౌమ్యుడుగా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా, భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవి అన్నారు.
డా.మన్మోహన్ సింగ్ గారి మరణం భారత దేశానికి తీరని లోటని అన్నారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.