
Ex-MLA Gandra Leads Dharna Over Bhupalpally Road Works
రోడ్డుపై ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
అంబేద్కర్ చౌరస్తా టు జంగేడు వరకు నాలుగు లైన్ల రోడ్డు పనులు గత రెండు సంవత్సరాల నుండి పూర్తికాలేదు ఈ రోడ్డు నిధులను స్థానిక ఎమ్మెల్యే తన సొంత మండలమైన ఘనపురం మండలానికి నిధులను దారి మళ్లించారు ఈ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమనే రెడ్డి ధర్నా నిర్వహించారు
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తా నుండి జంగేడు వరకు సెంట్రల్ లైటింగ్ నాలుగు లైన్లతో రోడ్డుకు 10 కోట్లతో రూపాయలతో రోడ్డు నిర్మాణానికి గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది కానీ ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు 10 కోట్లు కేటాయించడం జరిగింది కానీ ఆ నిధులను స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే భూపాలపల్లి అభివృద్ధిని మరిచి నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం నిధులను తన సొంత మండలమైన ఘనపురం మండలానికి నిధులను దారి మళ్లించారు ఇప్పటికైనా అంబేద్కర్ చౌరస్తా టు జంగేడు వరకు నాలుగు లైన్ల రోడ్డుకు నిధులు కేటాయించి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి రఘుపతిరావు తిరుపతి మాడ హరీష్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు