భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి,సోమనపల్లి,అంకుషాపూర్, రామకిష్టపూర్ (టీ),పంగిడిపల్లి,పెద్ధంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సమావేశంలో గండ్ర వెంకట రమణా రెడ్డి కార్యకర్తల ను ఉద్దేశించి మాట్లాడుతూ.
ఓటు అనేది ఒక్క పార్టీకి, ఒక్క వ్యక్తి కోసం కాదు దేశ ప్రజల అభివృద్ధికి వేయాల్సిన ఓటు.
మే13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి డా.సుధీర్ కుమార్ గారి కారు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు…
తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి,తొలి ముఖ్యమంత్రి,బి ఆర్ ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు,రాష్ట్ర అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేసి కళ్యాణ లక్ష్మీ,అపర భగీరథుడై అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించి రాష్ట్రం మొత్తం గోదావరి జలాలను పారించి బీళ్లు బారిన పొలాలను పచ్చని మాగాణి చేసి అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనుడు మన కేసీఆర్
10 ఏండ్ల పరిపాలన ఎంతో మార్పు తీసుకోచిండు.
ఆనాడు సమైక్య ఆంధ్రలో కరెంటు కష్టాలు చూసినం, రైతు ఆత్మహత్యలు చూసినం.
కానీ కేసీఆర్ రైతుల సంక్షేమం కొరకు 10000/- రూపాయల పంట సహాయం,5 లక్షల రూపాయల రైతు భీమా, 24 గంటల నాణ్యమైన కరెంట్,గోదావరి జలాలను ప్రతి ఇంటికి,ప్రతి గుంటకు అందించారు.
అయిన సరే ప్రజలు దొంగ హామీలకు, గారడీ మాటలకు లొంగి లక్ష రూపాయలు + తులం బంగారం,మహిళలకు 2500, 500లకే వంట గ్యాస్,ఉచిత బస్సు వంటి పథకాలకు మహిళలు ఆశపడితే,వృద్ధులు,వితంతువులు 4000 రూపాయలకు ఆశపడితే,రైతులు రూ. 15000/- రైతు బంధుకి, రైతు కూలీలు రూ.12000/-,రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తామనే విద్యార్థినులకు కేనటిక్ స్కూటీ లు ఇస్తామని ఆశ పడి ఓటు వేసి మోసపోయారు.
కావున ఇవన్నీ ప్రజలందరికీ మరొక్కసారి అర్థమయ్యేలా చెప్పి ఓటు ఉద్యమ పార్టీ బి ఆర్ ఎస్ పార్టీకి ఎందుకు వెయ్యాలి,దొంగ హామీల కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెయ్యాలి, మతతత్వ పార్టీ బిజేపి కి ఎందుకు ఓటు వేయాల్లో వివరించాలని కోరారు.
అదే విదంగా భూపాలపల్లి అభివృద్ధి కొరకు అహర్నిశలు నా వంతు కృషి చేసిన,నేను ఇచ్చిన పనులకు మళ్ళీ ప్రస్తుత శంకుస్థాపన చేయడం, అభివృద్ధి పనులను రద్దు చేయడం సిగ్గు చేటు.
ఎన్నికలకు ముందు వరకే పక్షపాతం ఉండాలి,ఎమ్మెల్యే అయిన తరువాత నియోజకవర్గం మొత్తం ప్రజానీకానికి ఎమ్మెల్యే అని ఎద్దేవా చేశారు.
నేను అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు మీ మధ్యనే ఉంటా,ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా,ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రజల తరువున వారి సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు.
ప్రజలందరూ బి ఆర్ ఎస్ పార్టీకి ఓటు వేసి డా.సుధీర్ కుమార్ ని గెలిపించాలని, ఈ గెలుపు దొంగ హామీల కాంగ్రెస్ పార్టీ,రేవంత్ రెడ్డికి చెంప పెట్టు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి ఆకునూరు తిరుపతి సోమనపల్లి మాజీ సర్పంచ్ మహేష్ యాదవ్ సదానందం తదితరులు పాల్గొన్నారు