Former MLA Gandra Inaugurates Cricket Tournament
గెట్ టు గెదర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలోని మున్సిపాలిటీ గ్రౌండ్ నందు నిర్వహిస్తున్న జంగేడు–భూపాలపల్లి గెట్ టు గెదర్ క్రికెట్ టోర్నమెంట్ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు.
ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ వారికీ శుభాకాంక్షలు తెలిపారు
ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ.
వివిధ రకాల వృత్తులు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అందరూ ఒకే వేదిక పై కలవడం ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గత స్మృతులను గుర్తుచేసుకునే ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఇట్టి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ..
ఈ కార్యక్రమం ద్వారా మరింత క్రమశిక్షణ, స్నేహభావం పెరుగుతాయని అన్నారు.
ఇలాంటి టోర్నమెంట్లు యువతలో ప్రతిభను వెలికితీసే వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
