
Challa Pays Tribute to Reguri Rangamma
రేగూరి గంగమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా
గంగమ్మ ప్రతివాదేహానికి మహిళా కమిటీ నాయకురాళ్ల నివాళులు
పరకాల నేటిధాత్రి
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి తల్లి రేగూరి రంగమ్మ నిన్న సాయంత్రం మృతిచెందడం జరిగింది.విషయం తెలుసుకున్న పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి రంగమ్మ పార్దివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.పరామర్శించిన వారిలో పరకాల నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.
రంగమ్మ పార్థివదేహానికి మహిళ నాయకురాళ్ల నివాళులు
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి తల్లి రేగూరి రంగమ్మ నిన్న సాయంత్రం మృతిచెందగా బిఆరఎస్ మహిళా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రంగమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.మహిళా పట్టణ అధ్యక్షురాలు గంటా కళావతి,సాంబరాజు జ్యోతి మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.