హసన్ పర్తి/ నేటి ధాత్రి
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త పోగుల బిక్షపతి గత ఏడాది ప్రమాదవశాత్తు పొలంలో పడి మృతి చెందగా బి ఆర్ ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరు అయినా 2 లక్షల రూపాయల చెక్కును స్వయంగా వారి గృహానికి వెళ్ళి ఆ కుటుంబానికి అందచేసిన బి ఆర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజక వర్గ మాజీ శాసన సభ్యులు ఆరూరి రమేష్. ఈ సందర్భంగా ఆరూరి మాట్లాడుతూ బి ఆర్ ఎస్ కార్యకర్త బిక్షపతి ప్రమాదవశాత్తు చనిపోవడం బాధాకరమని వారి కుటుంబాన్ని పార్టీ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది అందుకే బి ఆర్ ఎస్ పార్టీ ద్వారా మంజూరు అయినా 2 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబానికీ అందజేయడం జరిగిందన్నారు.