Former Minister Leads Tribute to Dr. B.R. Ambedkar in Zaheerabad
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు,
◆:- జహీరాబాద్ ఇంఛార్జి డా: ఏ. చంద్రశేఖర్….
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ ఏ. చంద్రశేఖర్ ఆయన ఆధ్వర్యంలో నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అందరికీ సమాన విద్య,ఆరోగ్యం,ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనకు సమ న్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సమ సమాజనిర్మాణంలో బాబాసాహెబ్ ను ప్రపంచ దేశాలు మరియు ఐక్యరాజ్య సమితి “సింబల్ ఆఫ్ నాలెడ్జ్”గా గుర్తించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కండెం నర్సిములు,మాజీ కౌన్సలర్ లు,యూత్ కాంగ్రెస్ నాయకు,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
