
Tatiparthi Jeevan Reddy Warns on Fake Investment Apps
జగిత్యాల ఇందిరా భవన్ లో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం
రాయికల్, అక్టోబర్ 13, నేటి ధాత్రి:
అధిక లాభాపేక్షతో పెట్టుబడులు పెట్టి అమాయక ప్రజలు మోసపోతున్నారు.
ఫేక్ యాప్ ల ద్వారా అధిక లాభాపేక్షను ఎర చూపి, గ్రామీణ ప్రజలతో పాటు వివిధ హోదాల్లో ఉన్నవారు సైతం
మెట్ ఫండ్, యు బిట్ లలో చైన్ విధానంలో
పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు.
పెట్టుబడి దారులకు విదేశీ టూర్లు, లక్సరీ వసతుల పేరిట అమాయక ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు.
గతంలో ఫైనాన్స్ కంపెనీలు రెగ్యులేటరీ లేదు..ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ పేరిట నకిలీ యాప్లు, వెబ్సైట్లు విస్తరించాయి.
ఆర్ బి ఐ అనుమతులు లేకుండా చేపట్టే ఏ ఆర్థిక కార్యక్రమాలు అయినా చట్ట విరుద్ధమే.
కేవలం జగిత్యాల జిల్లా లోనే సుమారు 1000 కోట్లు మోసపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
పెట్టుబడులు పెట్టిన వారికి ఏవిధమైన రశీదులు లేకుండానే పెట్టుబడులు పెడుతున్నారు.
క్షణాల వ్యవధిలో యాప్ లు తొలగిస్తూ ఆధారాలు లేకుండా చేస్తున్నారు.
జగిత్యాల పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేయడం అభినందించదగ్గ విషయం.
నకిలీ యాప్ లలో పెట్టుబడులు పెట్టీ మోసపోయిన వారు పోలీసుల దృష్టికి వచ్చేది ఒక్క శాతం కూడా లేదు.. ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు..
రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, జూదం అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది.
చట్ట పరమైన చర్యలు తీసుకోవడం తో పాటు, రికవరీ అవుతుందో లేదో అని భయపడి కేసు పెట్టేందుకు ముందుకు రావడం లేదు.
నకిలీ యాప్ లలో అమాయక ప్రజలను పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించిన వారి ఆస్తులు జప్తు చేయాలి.
పోలీసులు కేసులు నమోదు చేయడంతోపాటు రికవరీ చేస్తామనే విశ్వాసం బాధితుల్లో కల్పిస్తేనే ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తారు.
రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు తగ్గిపోయి, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.
ఆర్ బి ఐ అనుమతులు లేకుండా
నిర్వహిస్తున్న ఆర్థిక కార్యకలాపాలు
దేశ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది.
దేశ రక్షణ తో పాటు ఆర్థిక వ్యవస్థ రక్షణ కూడా ప్రధానం.
రాష్ట్ర పరిధిలో ఏ మేరకు నిలుపుదల చేస్తాం.. అని పరిశీలించి ఆర్థిక మోసాలు అరికట్టేలా చర్యలు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కేంద్ర హోమ్ శాఖ, ఆర్థిక శాఖ సైతం నకిలీ యాప్ లు, వెబ్సైట్ లలో పెట్టుబడులను అరికట్టేలా చొరవ తీసుకోవాలి..
నకిలీ యాప్ లలో పెట్టుబడులు పెట్టీ మోసపోవడం జగిత్యాల జిల్లాకే పరిమితం కాలేదు. బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు.
పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని, ఆర్థిక నేరాలు చేసిన వారి ఆస్తులు జప్తు చేయాలి.
పోలీసులు సుమోటోగా విచారణ చేపట్టాలి..
రాష్ట్ర స్థాయిలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ఆర్థిక నేరాల వ్యవహారాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్న..