మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన కేతావత్ కమలమ్మ ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో మరణించడం జరిగింది. బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ప్రవేశపెట్టిన భారత రాష్ట్ర సమితి ఇన్సూరెన్స్ విభాగం నుండి కేతావత్ కమలమ్మ కుటుంబ సభ్యులు కేతావత్ శంకర్ కి బి ఆర్ ఎస్ పార్టీ నుండి రూ.2 లక్షల రూపాయల చెక్కును మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్ రావుల అనంతరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, నవకాంత్, పాల సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.