సీసీఐ కొనుగోలు కేంద్రం తెరవాలి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిధాత్రి :
సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని వెంటనే తెరవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం లేనందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని దళారుల చేతుల్లోకి మళ్ళించడానికి ప్రభుత్వం సిసిఐ కేంద్రo తెరవడంలేదని ఆయన విమర్శించారు . రైతుల కష్టపడి అప్పులు చేసి పండించిన ధాన్యానికి సి సీఐ కొనుగోలు కేంద్రం లేకపోవడంతో గిట్టుబాటు ధర రావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు అడ్రస్ లేదని క్వింటాల్ వడ్లకు 500 బోనస్ ఇస్తామని రైతులు పండించిన వడ్లు నాణ్యత లేదని ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ లో రైతులు పండించిన పత్తికి అక్కడి ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందిని తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతులు పండించిన పత్తి ధరకు మద్దతు ధర ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులను కోరారు . తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పత్తి ధరకు ఇద్దరు కేంద్ర మంత్రులు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు వారికి. తెలంగాణ రాష్ట్ర రైతుల గురించి పట్టించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు చేయడం తప్ప రైతులకు ఇంతవరకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో పండించిన పత్తి కి రైతులకు క్వీ oటా లుకు 8257 చెల్లించే విదంగా చర్యలు ఆయన డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *