
నల్గొండ, నేటిధాత్రి:
హరీశ్ రావు కామెంట్స్:
మీ అందరి ఉత్సాహం చూస్తుంటే భువనగిరిలో ఎగిరేది గులాబీ జెండానే అనిపిస్తోంది.
భూములు, ఆస్తులు కాపాడుకోవడానికి ఇసుక కంకర దొంగతనాలు చేయడానికి పార్టీలు మారవచ్చు కానీ నిజమైన ఉద్యమకారులు కార్యకర్తలు బీఆర్ఎస్ తోనే ఉన్నారు.
కాంగ్రెస్ వాళ్లు అధికారంతో కళ్ళు నెత్తికెక్కి గాలిలో ఉన్నారు.
మంత్రి కోమటిరెడ్డి అహంకారంతో విర్రవీగుతూ రైతుబంధు అడుగుతే రైతులను చెప్పుతో కొట్టాలి అంటున్నాడు.
వీళ్ళ అహంకారం దింపాలంటే క్యామ మల్లేష్ గారిని గెలిపించి పార్లమెంటుకు పంపించాలి.
వంద రోజుల్ల ఆరు గ్యారంటీలు 13 హామీలు నెరవేరుస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చిన కాంగ్రెస్ నాయకులు తప్పించుకొని తిరుగుతున్నారు.
ఎందుకు అమలు చేయలేదని అడిగితే దేవుళ్ళ మీద ఒట్టేస్తూ మళ్లీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ప్రామిసరీ నోట్లు ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రామిస్‌లు. మళ్లీ మోసపోదామా?
మొదటి హామీ అక్కచెల్లెళ్లకు మొదటి తారీకు 2500 ఇస్తామన్నారు, ఎవరికైనా 2500 పడ్డాయా.?
నాలుగు నెలలకు 2500 రూపాయలు లెక్కన అక్క చెల్లెళ్లకు పదివేల రూపాయలు కాంగ్రెస్ బాకీ పడింది.
రెండో హామీ రైతులకు 15000 రైతుబంధు. కెసిఆర్ ఇచ్చిన 10000 రైతుబంధు కూడా ఇప్పటికి పూర్తిగా వేయలేదు.
కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతులకు రైతుబంధు ఇచ్చి రైతులను కాపాడుకున్నాడు.
వడ్లకు మక్కలకు మద్దతు ధరపైన 500 బోనస్ ఇస్తామని రైతులను మోసం చేసింది కాంగ్రెస్.
500 బోనస్ పక్కన పెడితే మద్దతు ధరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనట్లేదు.
ఆసరా పింఛన్ 4000 చేస్తా అని మాటతప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన 2000 కూడా ఒక నెల ఎగ్గొట్టింది.
భద్రాచలం పోయి రాముడు మీద ఒట్టు, మెదక్ వై చర్చ్ మీద ఒట్టు, సిద్దిపేటకు వచ్చి మల్లన్న మీద ఒట్టు అని ఒట్ల రాజకీయం చేస్తున్నారు.
ఆగస్టు 15 వరకు ఆరు హామీలు 13 గారెంటీలు అమలు చేస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా చేయకపోతే నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా రేవంత్ రెడ్డి!
నా సవాలును ఇంకా రేవంత్ రెడ్డి స్వీకరించలేదంటే ఆరు గ్యారెంటీలు 13 హామీలు అమలు చేయమని చెప్పకనే చెప్తున్నట్టే.
మళ్లీ మనం నమ్మి కాంగ్రెస్‌కు ఓటేస్తే ఈ ఐదు సంవత్సరాలు చూద్దామంటే కూడా దొరకరు.
ప్రజల కోసం కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపించాలి. భువనగిరిలో క్యామ మల్లేశ్‌ను మీరు గెలిపిస్తే రేపు అసెంబ్లీలో కాంగ్రెస్‌ను నిలదీస్తాం.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ప్రభుత్వమేం పడిపోదు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేపిస్తాం.
ఆడపిల్లల పెళ్ళికి కెసిఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్న కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక జరిగిన లక్ష పెళ్లిళ్లకు లక్ష తులాల బంగారం బాకీ పడింది.
ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలు చేశామని మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
మహాలక్ష్మి కింద 2500 మహిళలకు వచ్చిందా, ఆసరా పెన్షన్ 4000 కి వచ్చాయా, 15000 రైతుబంధు వచ్చిందా, నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి వచ్చిందా, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం వచ్చిందా?
భువనగిరిలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంత్రి పదవి వస్తుందని ఆశపడి రాజగోపాల్ రెడ్డి పాకులాడుతున్నారు.
భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిలో ఏ గుణగణాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది?
రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తికి టికెట్ ఇచ్చిర్రు.
మొన్ననే భూకబ్జాలు చేశాడని కేసు కూడా నమోదయింది.
బీసీ బిడ్డను క్యామ మల్లేశ్‌ను ఆశీర్వదించి భువనగిరి నుంచి గెలిపించాలని మీ అందర్నీ కోరుకుంటున్నాను.
కాంగ్రెస్‌కి ఓటు వేయొద్దని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయకుండా బీజేపీకి ఓటేస్తే పెనం మీదనుండి పొయ్యిలో పడ్డట్టు అయితది.
బిజెపి వచ్చి పది సంవత్సరాల్లో ఎవరికి ఏం చేసింది.
ప్రజల మీద అధిక ధరలు మోపి జిఎస్టి వేసి నడ్డి విరిచింది. పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజలను ఆగం చేసింది.
మునుగోడు బైఎలెక్షన్లో ప్రభాకర్ అన్న గెలిపిస్తే చండూరు రెవెన్యూ డివిజన్ చేస్తానని మాట ఇచ్చిన కేసిఆర్ రెవెన్యూ డివిజన్ చేసి చూపించారు.