ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి
శ్రీశైలం లో కొలువు తీరిన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని శుక్రవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు సతీసమేతంగా దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది..వేదపండితులు పూర్ణకుంభంతో కొప్పుల ఈశ్వర్ కి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సంధర్భంగా వారు,మాట్లాడుతూ ,భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారిని అమ్మవారిని దర్శించుకోవటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, ఆ అమ్మవారి దీవెనలు మనందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.
భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల దంపతులు
