Former Minister Inspects Polling Booths in Zaheerabad
పోలింగ్ బూత్‌లను పరిశీలించిన మాజీ మంత్రి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ బుధవారం ఉదయం 19వ వార్డులోని 60, 61 పోలింగ్ బూత్‌లను సందర్శించారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల పోలింగ్ సరళిని ఆయన పర్యవేక్షించారు. అధికారులతో మాట్లాడి, ఓటర్లు ప్రశాంతంగా, ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషకరమని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, సజావుగా కొనసాగాలని సూచించారు.
