మల్లన్నసాగర్‌ వద్ద బీఆర్‌ఎస్‌ బృందం ప్రత్యేక పూజలు

*మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు ఆధ్వర్యంలో..పూజలు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు.*

*మల్లన్నసాగర్‌ లో 21 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి – హరీష్ రావు*

*నిండుకుండలా మల్లన్నసాగర్‌ను చూసి కడుపునిండింది*

*కాళేశ్వరం మునిగింది, కొట్టుకుపోయిందని వాళ్లకి మల్లన్నసాగర్‌ లోని జలాలే చెంపపెట్టు లాంటి సమాధానం*

*కాళేశ్వరం డిజైనింగ్ సరిగా లేదని, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని.*

*కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు చేశారు*

*కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్యపు ఆరోపణలు చేశారు*

*కాళేశ్వరం కొట్టుకపోయిందని అబద్దాలు ప్రచారం చేశారు*

*నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోతే మల్లన్న సాగర్లోకి 21 టీఎంసీల నీళ్లు ఎట్ల వచ్చాయ.*

*మల్లన్న సాగర్ కు రికార్డు స్థాయిలో 21 టీఎంసీల నీరు విడుదలైన సందర్భంగా ప్రాజెక్ట్ ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*

*మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్*

కెసిఆర్ గారు కట్టించిన మల్లన్న సాగర్ 21 టీఎంసీల నీటితో ఒక సముద్రంలాగా కనిపిస్తుంది. 

ఈ దృశ్యాన్ని చూసి కడుపు నిండినంత సంతోషం కలిగింది 

కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని, కాళేశ్వరం మునిగిపోయిందనే వాళ్ళకి చెంపపెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెబుతున్నది. 

లక్ష కోట్లు వృధా అయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు పోయిందని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు అబద్ధం అని గలగల పారుతున్న గోదావరి నీళ్ళే సమాధానం చెప్తున్నాయి. 

కాళేశ్వరం కొట్టుకుపోయి ఉంటే ఈరోజు మల్లన్న సాగర్ లో 21 టి.ఎం.సిల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాను? 

ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజ్ నుంచి అన్నపూర్ణ మ్యారేజ్ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండడంవల్లే సాధ్యమైంది. 

మల్లన్న సాగర్ నిండుకుండలా ఉంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా అని అడుగుతున్నాను. 

కాలేశ్వరం ప్రాజెక్టు కింద పండే ప్రతి పంటలో కేసీఆర్ పేరు ఉంది. ప్రతి రైతు గుండెల్లో కేసీఆర్ పేరు నిలబడి ఉంటది. 

కాలేశ్వరం కొట్టుకుపోయిందనే మూర్ఖుపు ప్రచారాన్ని కాంగ్రెస్ మానుకోవాలి. 

కెసిఆర్ కట్టించినటువంటి అన్నపూర్ణలో మూడు టిఎంసిలు, రంగనాయక సాగర్ లో మూడు టీఎంసీలు, మల్లన్న సాగర్లో 21 టీఎంసీలు నింపుకున్నాం. కొండపోచమ్మలో పది టీఎంసీల నీళ్లు నింపుకున్నాం అంటే ఇది కేసీఆర్ గారి కృషివల్లే సాధ్యమైంది. 

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికి దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వి డైవర్షన్ పాలిటిక్స్, మాదేమో రైతులకు నీళ్లు ఇయ్యాలనే తపన. మాది వాటర్ డైవర్షన్, కాంగ్రెస్దేమో అటెన్షన్ డైవర్షన్. 

21 టి.ఎం.సిలతో సముద్రాన్ని తలపించే మల్లన్న సాగరే కాళేశ్వరానికి సజీవ సాక్ష్యం. 

కాంగ్రెస్ నాయకులు మీరు కూడా వచ్చి మల్లన్న సాగర్ లో ఇంత పసుపు కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి. 

నీళ్లతో మెదక్ జిల్లా, యాదాద్రి జిల్లా, సిద్దిపేట జిల్లాల్లో పంటలు పండడం మీకు ఇష్టం లేదా? రైతుల పొలాలు పండడం మీకు ఇష్టం లేదా?

రైతులకు నీళ్లు వచ్చిన సంతోషంతో గోదావరి జలాలకు పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుందామని వచ్చాం. దాన్ని కూడా మీరు అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం. 

మల్లన్న సాగర్ లో మొదటిసారి 21 టీఎంసీ నీళ్లు నిండడం చూసి చాలా సంతోషంగా ఉంది. 

మల్లన్న సాగర్ పూర్తయింది. కాలువలు కూడా 90% పూర్తయ్యాయి. మిగతా పది శాతం పిల్ల కాలువలను పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 

యాసంగి పంటకు బ్రహ్మాండంగా మూడు నాలుగు జిల్లాలకు నీళ్లు రాబోతున్నాయి. 

రేవంత్ రెడ్డి హైదరాబాదుకు మంచినీళ్లు తీసుకపోతా, మూసికి నీళ్లు తీసుకుపోతా అని అంటున్నాడంటే అందుకు కేసీఆర్ గారు కట్టించిన కాలేశ్వరం మల్లన్న సాగరే దిక్కు అయింది కదా. 

మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్లి మూసిని శుభ్రం చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. హైదరాబాదుకు తాగునీరు మల్లన్న సాగర్ నుంచి అందిస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నాడు కాలేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఎట్ల సాధ్యమవుతుంది. 

అది మల్లన్న సాగర్ కాలేశ్వరం వల్లే సాధ్యమైతున్నది అన్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. 

ఎన్నికల ముందు అబద్ధాలు ప్రచారం చేశారు. లక్ష కోట్లు వృధా అయ్యాయని సర్వం కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేశారు. అయిందే 93,000 కోట్ల ఖర్చు అయితే లక్ష కోట్లు వృధా అయ్యాయని విష ప్రచారం చేశారు. 

93 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది.? 

ఇంకా అబద్దాలను నమ్మి అబద్దాలను ప్రచారం చేసేవాళ్లు మల్లన్న సాగర్ కొచ్చి చూడండి. 

పోయినసారి ఆగస్టు నెలలో చేప పిల్లలు వేసాం. ఈసారి సెప్టెంబర్ చివరికి వచ్చినా ఇప్పటివరకు చేప పిల్లలు పంపిణీ చేయలేదు. 

కెసిఆర్ పుణ్యమా అని చెరువులు మంచిగైనాయి. నదులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసిండు కేసీఆర్. కాలం కాకపోయినా ప్రాజెక్టుతో చెరువులు నింపుకునే అవకాశాన్ని కేసీఆర్ గారు ఇచ్చారు. 

అన్ని చెరువులు నిండుకుండలా ఉన్నాయి. ఎప్పటిలోగా చేప పిల్లల పంపిణీ చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. 

అన్ని చెరువుల్లో, ప్రాజెక్టుల్లో రొయ్యలు, చేపలు వేసి బెస్త, ముదిరాజ్ సోదరులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *