ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ హాస్యాస్పదం.

BRS PARTY

తేదీ:13-03-2025
వర్ధన్నపేట.నేటిదాత్రి:

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ హాస్యాస్పదం…ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య.

వద్దన్నపేట నియోజకవర్గ కేంద్రంలో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య గారు మాట్లాడుతూ…గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది.అందులో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మీరు ఐదు సంవత్సరాలు పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. అప్పుడు మీరు గ్రామ పంచాయతీలకు అందులో అప్పుడున్న సర్పంచులకు సకాలములో బిల్లులు చెల్లించక పోయే సరికి అప్పటి సర్పంచ్ లు,అప్పటి ఎంపీటీసీ లు,అప్పటి జెడ్పీటీసీ లు, అప్పటి ఎంపీపీ లు. బంగారం కుదువపెట్టీ, వడ్డీ వ్యాపారస్తుల వద్ద నుండి అధిక వడ్డీలకు అప్పులు చేసి వారు పనులు చేసినారు వారు చేసిన పనులకు బిల్లులు చెల్లించక పోయే సరికి బంగారం విడిపించలేని పరిస్థితి,వడ్డీలు కట్టలేక అసలు మిత్తి కలిపి భారంగా మారి సదర్ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మహత్యలు చేసుకున్నారు.

అప్పటి సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి దాపురించడానికి కారకులు బిఆర్ఎస్ పార్టీ కాదా అని నేను దయాకర్ రావు గారిని ప్రశ్నిస్తున్నాను అన్నారు

వారి పాపం మీ నాయకుడు కేసీఆర్ గారికి మరియు మీకు తగులుతుంది. వారి ఉసురు పోసుకుంది మీరు కాదా…? ఇప్పుడు మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు దయాకర్ రావు గారు నీతులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
కనీసం గ్రామ పంచాయితీలు ఏకగ్రివం అయిన వాటికి ప్రోత్సాహకంగా ఏకగ్రీవమైన గ్రామపంచాయతీ 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి 25 పైసలు ఇచ్చిన పాపాన పోలేదని ఏఏంసి చైర్మన్ వెంకటయ్య గారు గుర్తు చేశారు.

మీ బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో అప్పటి సర్పంచులు చేసిన వర్కులకు సంబంధించిన బిల్లు లేవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బిల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 691 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని తెలిపారు.

గ్రామపంచాయితీ పారిశుద్ద కార్మికులకు వేతనాలు చెల్లించాలని కెసిఆర్ ప్రభుత్వంలో కార్మికులు రెండు నెలలు నిరాహార దీక్షలు చేసిన కనికరించలేదు మీరు(దయాకర్ రావు),మి కెసిఆర్.
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏ ఉద్యోగికి అయిన ప్రతి నెల1-5 లోపల వేతనాలు ఇస్తున్నారు,2014 లో రాష్ట్రం ఏరుపడినపుడు 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంటే కెసిఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలములో 7 లక్షల కోట్లు అప్పులు చేసి పోతే,రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రతి నెల 7 వేల కోట్ల వడ్డీలు కడుతూ క్రమ పద్ధతిలో రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుంది.
నేడు బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం 6000 వేల కోట్ల రూపాయల కేటాయించడం జరిగింది.55 మిని గురుకులాలకు 11 వెలు కోట్లు కేటాయించడం జరిగింది.

అంటే రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా-రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయం గా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో సూపరిపాలనను అందిస్తుందని అన్నారు.

రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మనుగడ కోసం మాట్లాడే మాటలు ప్రజలు గమనిస్తున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తుడుచుక పెట్టుక పోవడం ఖాయం అని ఏఎంసీ చైర్మన్ వెంకటయ్య గారి జోస్యం చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!