
ముళ్ల పెళ్లి నేటి ధాత్రి
*-కేక్ కట్ చేసి, స్వీట్లను పండ్లు పంపిణీ చేస్తున్న బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బలుగూరి తిరుపతిరావు మాజీజడ్పిటిసి జోరుక సదయ్య,
పేదల పెన్నిధిగా..ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని.. తండ్రికి తగ్గ తనయుడిగా ఆపదొస్తే అండగా ఉండే కేటీఆర్ జన్మదిన వేడుకలు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ బుధవారం మండల పార్టీ అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీజడ్పిటిసి జోరుక సదయ్య, మాజీ సర్పంచులు చదువు అన్నా రెడ్డి రవీందర్ రావు ప్రభాకర్ రెడ్డి కేక్ కట్ చేసి, సీట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రఅభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన కల్వకుంట్ల రామారావు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, అభివృద్ధి అంటేనే కల్వకుంట్ల రామారావు గుర్తుకు వచ్చేలా.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఎవరినైనా ఆప్యాయంగా పలకరించే సున్నితమైన మనసు కలిగిన కల్వకుంట్ల రామారావు ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో..నిండు నూరేళ్లు..ఆయురారోగ్యాలతో..అష్టైశ్వర్యాలతో..మరింత ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజలకు మరిన్ని సేవలు చేసే యోగ్యం కల్పించాలని ఆ దేవున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దేవునూరి కుమార్ స్వామి నేర్పాటి శ్రీనివాసు బొల్లేని రవికుమార్ కత్తి రాజు పడిదలబాపురావు శనిగరపు శ్రీనివాస్ లడెరాజు రామస్వామి జెన్నీ రాజు శ్రీను మహేష్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.