కాప్రా నేటి ధాత్రి జనవరి 06
చర్లపల్లి డివిజన్ బీ ఆర్ ఎస్ నాయకుడు భువనగిరి ధనుంజయ ఈరోజు ఉదయం పరమదించారు.చర్లపల్లి వారి నివాసంలో భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం స్వగ్రామం రామచంద్రాపురం లో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోసి,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి,ఓదార్చి ఎల్లవేళలా ధనుంజయ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేసిన హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్
ధనుంజయ మృతి చాలా బాధాకరమని,బీ ఆర్ ఎస్ పార్టీకి తీరని లోటని,పార్టీ తరపున ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన చురుకుగా పాల్గొనే వారని,వ్యక్తిగతంగా కూడా నలుగురికి సహాయ సహకారాలు అందించే వారని గుర్తు చేసుకుంటూ రామ్మోహన్,శ్రీదేవి యాదవ్ కన్నీటి పర్యంతమయ్యారు.డివిజన్ నాయకులు కూడా ధనుంజయ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని అంత్యక్రియల్లో పాల్గొన్నారు.