మత భావజాలాలను వ్యతిరేకించిన దీరవనిత ఇందిరాగాంధీ
పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ వర్ధంతి
నర్సంపేట,నేటిధాత్రి
భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ మత భావజాలాలను వ్యతిరేకించిన దీరవనిత అని కాంగ్రెస్ పార్టీ నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్ అన్నారు.ఇందిరాగాంధీ 41వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు బత్తిని రాజేందర్ మాట్లాడుతూ సెక్యులర్ భావజాలానికి అంకితమై దేశ రాజకీయాల్లో మత భావజాలాలను తీవ్రంగా వ్యతిరేకించిందని కొనియాడారు.భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం,దేశ అభివృద్ధి కోసం, అనేక సరళీకృత సంస్కరణలు చేసి దేశంలో గ్రీన్ రెవల్యూషన్ విజయం ద్వారా దేశ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయురాలుగా నిలిచిపోయారని కొనియాడారు., ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబ రెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి, నర్సంపేట పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు ధోని కీర్తన,నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ ఆడపు రమ, ముఖ్య నాయకులు కాటా ప్రభాకర్, ముత్తినేని వెంకన్న, లక్కాసు రమేష్, నాడెం నాగేశ్వర్, దండం రతన్ కుమార్, గద్ద వెంకటేశ్వర్లు, కొప్పు అశోక్, నాగేల్లి సారంగం గౌడ్, దేశీ సాయి పటేల్ మహమ్మద్ సర్వర్ తదితరులు పాల్గొన్నారు.
