
Former DSP Nalini’s Shocking Post
మాజీ డీఎస్పీ నళిని సంచలన పోస్టు.. అసలు విషయమిదే..
మాజీ డీఎస్పీ నళిని సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్లో సంచలన పోస్టు చేశారు. తన అనారోగ్యంపై మరణ వాంగ్మూలం అంటూ ఆమె పోస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల తనకు నిలువెల్లా గాయాలే అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ డీఎస్పీ నళిని (Former DSP Nalini) సోషల్ మీడియా మాధ్యమం ఫేస్బుక్లో సంచలన పోస్టు చేశారు. తన అనారోగ్యంపై మరణ వాంగ్మూలం అంటూ ఆమె పోస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల తనకు నిలువెల్లా గాయాలే అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాత వాసంలో ఉన్నానని వాపోయారు. మహర్షి దయానందుని దయవల్ల ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుని, అందులోనే వేద యజ్ఞ పరిరక్షణ సమితి స్థాపకురాలుగా ఎదిగానని ఉద్ఘాటించారు మాజీ డీఎస్పీ నళిని.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తనకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆరు నెలల తర్వాత తన పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్త బుట్ట పాలైందని తెలిసిందని అన్నారు. తన ఆఫీస్ కాపీని మళ్లీ స్కాన్ చేసి పంపానని తెలిపారు. ఆ విషయంపై ఇప్పటి వరకు స్పందన లేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మీడియాకు మాజీ డీఎస్పీ నళిని ఓ విజ్ఞప్తి చేశారు. తాను చనిపోయిన తర్వాత ఎవరూ కూడా సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయవద్దని….రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞ బ్రహ్మ అని తనను సంభోదించాలని అంటూ పోస్ట్ చేశారు. అయితే నళిని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.