Umakant Patil Felicitates Newly Elected BRS Representatives
సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ లు నూతనంగా గెలుపొందిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లో ఉమాకాంత్ పాటిల్ నివాసం లో మాజీ సీడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.వారికి ఉమాకాంత్ పాటిల్ పూల మాల వేసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ రాజు మాజీ సర్పంచ్ కృష్ణ ఉప సర్పంచ్ తుక్కారం,వార్డు సభ్యులు నాగన్న బస్వరాజు పటేల్, ఎల్లన్న,రాజేందర్, సంగ్రామ్,, సిద్దన్న సుధన్, రమేష్ పటేల్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
