గంగాధర నేటిధాత్రి
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడికి నిరసనగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ధర్నా పిలుపుమేరకు హైదరాబాద్ బయలుదేరుతున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంక్ రవిశంకర్ ను శుక్రవారం రోజున బూరుగుపల్లి లోని తన స్వగృహంలో హౌస్ అరెస్ట్ చేశారు.అంతేకాక మండలంలోని వివిధ గ్రామాలలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.అరెస్టు చేసిన వారిలో ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, మాజీ సర్పంచ్లు మాడ్లపెల్లి గంగాధర్,వేముల అంజి, యండి నజీర్, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నాను.