
కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధ్యక్షులు ఎల్తూరి శ్రీనివాస్
పరకాల నేటిధాత్రి
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ ఆదేశాలమేరకు బీఎస్పీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి కందుకూరి యువ కిషోర్,పరకాల అసెంబ్లీ ఇన్చార్జులు ఆముదాల పెళ్లి మల్లేశం గౌడ్,పెండేల మహేందర్ అధ్యక్షతన హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.అసెంబ్లీ అధ్యక్షులుగా అమ్మ సాంబయ్య,ఉపాధ్యక్షులుగా అర్షం మధుసూదన్,ప్రధాన కార్యదర్శి మేకల విష్ణు,కార్యదర్శిగా దామెర రాజేందర్,కోశాధికారిగా బోట్ల రాజు పూలేలను అసెంబ్లీ కమిటీగా ఎన్నుకోవడం జరిగింది.నూతన కమిటీకి బిఎస్సి హనుమకొండ జిల్లా అధ్యక్షులు అమ్మఒడి శ్రీనివాస్ సూరి బహుజన సిద్ధాంతాలను బోధిస్తూ బెహాన్ జీ మాయావతి నాయకత్వంలో ఏడు రాష్ట్రాల ఇన్చార్జ్ రాంజీ గౌతమ్ పర్యవేక్షణలో నేషనల్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్ బహుజన రాజకీయ సిద్ధాంతాలను అమలు చేస్తూ బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ ఆశయాలను ముందు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బహుజన సైనికుల పనిచేయాలని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నడికూడ మండల అధ్యక్షులు శనిగరపు వెంకటేష్,రవి,సంధ్యారాణి, సులోచన,చక్కనయ్యా,అమీర్ తదితరులు పాల్గొన్నారు.