కొత్తగూడెం.జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
మెడికల్ కాలేజీలో విద్యార్థులు హాస్టల్లో కనీస సౌకర్యాలు లేవని,హాస్టల్ ఫుడ్ నాణ్యత లేదని,త్రాగునీరు సక్రమంగా అందించడం లేదని, మెస్ చార్జీలు వసూలు చేస్తున్నారని, అధిక బస్సు చార్జీలు వసూలు చేస్తున్నారని, ప్రిన్సిపల్, అసిస్టెంట్లు క్రమశిక్షణ నెపంతో రాత్రులు హాస్టల్ క్యాంపస్ లోకి ప్రవేశించి, వీడియోలు రికార్డ్ చేస్తూ బెదిరిస్తూ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు క్రీడలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా అనుమతించడం లేదని భద్రాద్రి కొత్తగూడెం లోని మెడికల్ కాలేజీ ఎదుట, కలెక్టరేట్ ఎదుట వైద్య కళాశాల విద్యార్థినీ,విద్యార్థులు సోమవారం ధర్నా చేశారు.
దీనికి సంబంధించి శ్రీమతి ఎస్. ప్రసూన రాణి జడ్పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షతన విచారణ కమిటీని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో యు. శ్రీనివాసరావు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు కే. సూర్యనారాయణ జిల్లా ఉద్యానవన అధికారి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ పై ఆరోపణలపై విచారణ జరిపి మార్చ్ 22 సాయంత్రం ఐదు గంటల లోపు నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆదేశించారు.