`వరుస ఘటనలు యాదృచ్ఛికం కాదు.
`ఒకదాని వెంట ఒకటి తెలియకుండా జరగడం లేదు.
`పన్నెండేళ్ళ క్రితం సీఎం పేరు గుర్తుందా?
`ప్రస్తుత సిఎం పేరు మర్చిపోయారా?
`తెలుగు మహాసభల పేరుతో తెలంగాణ మీద విద్వేశమా!
`తెలంగాణ మీద తెలుగు ముసుగులో దండయాత్రా?
`ఎవరి కోసం ప్రపంచ తెలుగు మహా సభ జరిగింది.
`జయసుధ లాంటి నటీమణులకు కూడా సిఎం తెలియదా!
`తెలంగాణ ప్రజలు సికింద్రాబాద్ నుంచి జయసుధను ఎన్నుకోలేదా?
`తెలంగాణ సిఎం పట్ల అంత నిర్లక్ష్యమా?
`ఎంత మంది తెలంగాణ కవులను పిలిచింది.
`ఎంత మంది తెలంగాణ ప్రొఫెసర్లు హజరయ్యారు.
`తెలంగాణలో తెలుగు వ్యాప్తికి మూడు యూనివర్సిటీలున్నాయి.
`వేలాది మంది తెలుగు బాషా ప్రావీణ్యులు తయారౌతున్నారు.
`మూడు యూనివర్సిటీల ప్రొఫెసర్లకు ఆహ్వానం లేదు.
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ గడ్డ మీద తెలుగు సభలు నిర్వహించుకుంటూ తెలంగాణ ప్రభుత్వ ముఖ్య పాలకుడి పేరు మర్చిపోవడం అన్నది సామాన్యమైన విషయంకాదు. ఇలాంటి సందర్భాలను ఉపేక్షించకూడదు. ఆ సభల ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆ సభ నిర్వాహాకులు ఆహ్వనించడం జరగింది. ఆ అధికారిక కార్యక్రమానికి ఎంతో హుందాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హజరు కావడం జరిగింది. పనికి మాలిన సభానిర్వాకులు, దిక్కుమాలిన వ్యాఖ్యాత బాలాదిత్యకు సభా నిర్వహణ బాధ్యతలు అప్పంచారు. అసలు బాలాదిత్య అనే వాడు తెలుగు ప్రభంభ ప్రభోదకుడా? లేక యూనివర్సిటీలో తెలుగును భోదించే ప్రొఫెసరా? లేక తెలుగు నిఘంటువను అవపోషన పట్టిన ఘటికుడా? తెలుగు బాష సరిగ్గ ఉచ్చరణ రాని వాళ్లను ఏర్పాటు చేసుకున్నప్పుడే అది తెలుగు సభ కాదు, తెగులు సభ అని అర్ధమైపోయింది. తెలంగాణ గడ్డ మీద తెలుగు సభ నిర్వహించకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా తెలియని మూర్ఖుడికి వ్యాఖ్యాత భాద్యదతలు అప్పగించడం ఆ సభ చేసిన మొదటి తప్పు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ పాలన సాగుతోంది? ఎవరు ముఖ్యమంత్రిగా వున్నారన్న సంగతి కూడా కనీస అవహాన లేని వ్యక్తిని పెట్టుకొని సభ నిర్వహించడం రెండో తప్పు. కనీసం ఎజెండాలో కూడా ముఖ్యమంత్రి పేరు రాసి లేకపోవడం మూడో తప్పు. ఒక వేళ ఎజెండాలో ముఖ్యమంత్రి పేరు వున్నప్పటికీ సరిగ్గా చూసుకోకుండా కార్యక్రమ నిర్వహన జరిపించడం నాలుగో తప్పు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సాదరంగా ఆహ్వానించపోయినా ఎంతో హుందాగా ఆయన ఆడిటోరియంలో కాసేపు కూర్చున్నారు. అది ఆయన గొప్పతనానికి నిదర్శనం. అయినా నిర్వాహకులు ముఖ్యమంత్రి రాకను ఏదో అందరూ సభ్యులు వచ్చినట్లు సంబోదించారు. అయినా ఫరవాలేదనుకుందామనుకున్నా పేరు మర్చిపోయారు. పైగా ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం ఉమ్మడిరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలంగాణ వ్యతిరేకి కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒకటికి రెండుసార్లు ప్రస్తావించారు. ఆడిటోరియంలో వున్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా అల్లరి చేయడంతో తేరుకొని, పక్కనుంచి ఎవరో పేరు చెబితే తప్ప తెలియనంత మూర్ఖుడిని వ్యాఖ్యాతగా పెట్టుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో అల్లు అర్జున్ వివాదం నడుస్తోంది. అయినా తెలుగు సభ నిర్వాహకులు ఒళ్లు దగ్గర పెట్టుకొకపోవడం పెద్ద పొరపాటు. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరంగా అన్ని రకాలైన అనుమతులు ఇస్తోంది. తెలుగు బాష సభల పేరుతో ముసుగేసుకున్న ఈ సభలో కూడా పాల్గొన్నది అందరూ సినిమా రంగానికి చెందిన వారే. తెలంగాణ ప్రభుత్వం ఈవెంట్ నిర్వహణకు అనుమతులిచ్చి, పోలీసుల సెక్యూరిటీ కల్పించి అల్లు అర్జున్ పుష్ప2 సభ నిర్వహణకు ఆమోదం తెలిపింది. అలాంటి సభలో అల్లు అర్జున్ లాంటి నటుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినట్లు నాటకాలాడాడు. తర్వాత మంచినీళ్లు తాగినట్లు కాసేపు ఆగి తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టినంత అహం ప్రదర్శించాడు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు ప్రస్తావించారు. సరిగ్గా ఈ తెలుగు సభలో కూడా బాలాదిత్య అనే వ్యాఖ్యాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపేరుకు బదులు మరో నాయకుడి పేరు ప్రస్తావించారు. ఇవి యాదృచ్చికంగా జరిగినట్లు ఎవరూ భావించొద్దు. తెలంగాణలో వుంటూ తెలంగాణ ముఖ్యమంత్రి గురించి తెలుగుసినిమా పెద్దలు పిచ్చి వేషాలేయడమే అవుతుంది. పన్నెండేళ్ల క్రితం పనిచేసిన ముఖ్యమంత్రి పేరు గుర్తున్న ఈ వెదవలకు, రేవంత్ రెడ్డి పేరు గుర్తు లేదనుకోలేం. అది వారి అహంకారానికి పరాకాష్ట. తెలుగు మహాసభ పేరుతో తెలంగాణ మీద విద్వేశం, విషం చిమ్మడమే అవుతుంది. బాలాదిత్య అనే వ్యాఖ్యాత పద్దతి అలా వుంటే ఆ స్టేజీ మీద కూర్చుని వున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కనీసం చూడకుండా సినీ నటి జయసుధ వెళ్లిపోయారు. కనీసం మర్యాద పూర్వకంగానైనా ముఖ్యమంత్రికి నమస్కారం చేయలేదు. ఇలాంటి వారు తెలుగు బాషను ఉద్దరిస్తారు. తెలుగును వెలిగిస్తారు. తెలంగంటేనే సంస్కారం,సభ్యత అని గొప్పలు చెప్పుకునే సినిమా నటుల అసలు గుణం, రూపం ఇక్కడే తేలిపోయింది. అయినా తెలుగు సభలు అంటే తెలుగు తెలిసిన విజ్ఞానులుండాలి. తెలుగు భాష మీద పట్టున్న నిష్ణాతులుండాలి. తెలుగులో ఉద్దండులైన బాషా పండితులుండాలి. సినీ రంగానికి చెందిన గుంపు మాత్రమే ఎందుకున్నది. తెలుగు సినిమాల్లో నటించే నటుల్లో తెలుగు సక్కగ రాని వాళ్లే ఎక్కువగా వున్నారు. తెలంగాణ యాసను కించపర్చే వాళ్లే అధికంగా వున్నారు. ఇంతకీ ఎవరి కోసం ఈ తెలుగు మహా సభ జరిగింది. ఆ సభ మీద తెలంగాణకు చెందిన వైతాళికులను గుర్తించలేదు. వారి ఫోటోలు ఎందుకు ఏర్పాటు చేయలేదు. అసలు తెలంగాణలో తెలుగు సభ ఏర్పాటు చేసుకొని ఏపి ముఖ్యమంత్రి చేత సభను ప్రారంభోత్సవం చేయించడమంటేనే తెలంగాణకు తీవ్ర అవమానం. తెలంగాణ ప్రభుత్వాన్ని సభ లెక్క చేయకపోవడం. సహజంగా సభల ముగింపు సమయంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలుస్తుంటారు. కాని తెలంగాణ గడ్డ మీద సభ ఏర్పాటు చేసుకొని ముగింపు సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పిలిచారు. అయినా తెలుగు మహాసభ అంటే ఏడు నక్షత్రాల హోటళ్లలో, సినీ తారల మధ్య పిడికెడు ఆంధ్రుల మధ్య జరుపుకోవడం ఏమిటి? తెలుగు సభలు అంటే ప్రజల ముందు జరగాలి. ఏ రాష్ట్రంలో జరిగితే ఆ రాష్ట్రానికి చెందిన తెలుగు పండితుల సమక్షంలో జరగాలి. తెలంగాణలో తెలుగు కీర్తిని దశ దిశలా వ్యాపింపజేస్తున్న మూడు యూనివర్సీటీలున్నాయి. తెలంగాణలో తెలుగు విశ్వవిద్యాలయం వుంది. అక్కడ వేలాది మంది కూర్చోగలిగే ఆడిటోరియమ్ వుంది. తెలుగు కోసమే ప్రత్యేకంగా యూనివర్సిటీ కొనసాగుతోంది. తెలుగులో ఎంతో మంది పండితులను, బాషా వేత్తలను ఏటా తెలుగు యూనివర్సిటీ తయారు చేస్తోంది. అక్కడ ఏర్పాటు చేయలేదు. వంద సంవత్సరాలుగా తెలుగుభాషకు సేవ చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ వుంది. సుమారు పది వేల మంది కూర్చునేంత విశాలమైన ఆడిటోరియం వుంది. అక్కడ ఏర్పాటు చేసుకోలేదు. తెలంగాణలో తెలుగు వెలుగులు పంచుతున్న సెంట్రల్ యూనివర్సిటీ వుంది. అదీ నిర్వాహకులు ఎంచుకోలేదు. కనీసం ఆయా యూనివర్సిటీలలో తెలుగు విభాగాలలో పని చేస్తున్న ఎంతో మంది ప్రొఫెసర్లు తెలంగాణలో వున్నారు. వారిని ఎవరికీ ఆహ్వానం లేదు. కనీసం సమాచారం కూడా లేదు. అలాంటప్పుడు ఇలాంటి దిక్కుమాలని సభలు ఏర్పాటు చేసి ఎవరికి లాభం? ఈ దిక్కుమాలిన సభ 11 మహా సభ అని ప్రకటించుకున్నది. అసలు మొదటి సభ ఎక్కడ జరిగింది. ఇన్నాళ్లు ఎక్కడ ఆ సభలు జరిగాయి? అన్నది ఎవరికీ అవగాహన లేదు. అసలు అలాంటి సభలు నిర్వహించినట్లు కూడా ఎక్కడా వార్తలు లేవు. గతంలో తెలంగాణలో ప్రపంచ తెలుగు మహసభలు ఎంతో గొప్పగా నిర్వహించిన ఘతన తెలంగాణ ప్రభుత్వానికి వుంది. అంత గొప్పగా తెలంగాణలో తెలుగు కీర్తిని ఆకాశమంత నిలబెడుతుంటే తెలుగుసభలపేరుతో తెలంగాణ పాలకులను విస్మరిస్తారా? అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్న సోయి అయినా నిర్వాహకులకు వుందా? ఇంకా ఉమ్మడి రాష్ట్రంలోనే వున్నామన్న భ్రమల్లో వున్నారా? సరే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు ఉన్న ఫలంగా గుర్తుకు రాకపోవడమే పెద్ద పొరపాటు. అయినా సరే గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంగా పాలన సాగుతోంది. కనీసం గత పాలకుడి పేరైనా గుర్తుకు రావాలి. ఆయన పేరు కూడా గుర్తుకు రాలేదు. కాని ఉఎప్పుడో పుష్కర కాలం కింద పాలించిన నాయకుడి పేరు మాత్రం టక్కున గుర్తొచ్చిందా? తెలుగు ముసుగులో తెలంగాణను ఇంకా ముంచాలని చూస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు సభలు తెలంగాణకు చెందిన వారికి ఆహ్వానం లేకుండా నిర్వహించుకున్నారు. నిజం చెప్పాలంటే ఆంద్రా, వేరు తెలంగాణ వేరు. ఆంద్రము అంటే తెలుగు కాదు. అది నివాస స్ధలం. ఆంధ్ర అనేది మొదటి శబ్దం అసలే కాదు. దాన్నే ప్రాంతంగా, బాషగా మల్చుకొని నాటకాలాడుతున్నారు. ఆధిప్యతం సాగిస్తున్నారు. తెలంగాణ యాస నాభి నుంచి పుట్టుకొస్తుంది. ఆంద్రతెలుగు యాస పెదవుల మీద మాత్రమే ఆడుతుంది. అందుకే ఆంద్రులు మాటలు చెప్పి బతుకుతుంటారు. గొప్పలు చెప్పుకొని కాలం గడుపుకుంటారు. తెలంగాణ యాసకు చమత్కారమెక్కువ. ఆంధ్ర యాసకు వెటకారమెక్కువ. అది ఇక్కడ కూడా చూపించారు. వారి బుద్దిని మరోసారి చాటుకున్నారు.