
మామిడిగూడెం గిరిజనుల భూములపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలి
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ డిమాండ్
నేటిధాత్రి చర్ల
చర్ల మండల కేంద్రంలోని ఆదివాసులపై ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలి నిన్న స్వాతంత్రం పేరుతో జెండా ఆవిష్కరణలు నేడు భూఆక్రమణదారులు అని ఆదివాసీ పంటలని ధ్వంసం చేయడం ఇదే స్వతంత్రమా అని న్యూడెమోక్రసీ పార్టీ అధికారులకు సూటి ప్రశ్న వేశారు
స్వాతంత్రం వచ్చిందంటూ నిన్నటి వరకు జెండా ఎగిరేసిన అధికారులు మూలవాసులకు ఆదివాసులకు అభివృద్ధి అధ్యయమని పోడు భూములకు పట్టాలిస్తామని ప్రగల్బాలు పలికిన నాయకులు అధికారులు నేడు పంటలు వేసుకున్న భూముల్లో పంటలను ఫారెస్ట్ వారు ధ్వంసం చేయడమే స్వాతంత్రమా అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు
79 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆదివాసీలకు 1/70 ఆక్ట్ ప్రకారం పిసా యాక్ట్ ప్రకారం అటవీ హక్కుల చట్టం ప్రకారం ఏజెన్సీలో పూర్తి హక్కులు కలిగి ఉండి కూడా అడవులను విధ్వంసం చేయకుండా సాగు భూమి కోసం సాగు చేసుకుంటున్న భూములలో పంటలను వేసుకుంటే చర్ల ఫారెస్ట్ అధికారులు వచ్చి వేసుకున్న పంటలను మొత్తం విధ్వంసం సృష్టించే విధంగా పత్తి మొక్కలు వేసిన భూములలో పంటలు పీకేసి ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా మొక్కలు వేసి వాళ్ల గాడ్లతోనే ఫారెస్ట్ అధికారులు వేసిన మొక్కలను పీకించుకొని మామిడిగూడెం గిరిజనులే మొక్కలు పీకారు అని అక్రమ కేసులు పెట్టాలనే ప్రయత్నాన్ని చేస్తున్నారని తిరిగి ఫారెస్ట్ అధికారులు పోలీసు అధికారులు ఒకటై ఆదివాసీల మీదనే కేసులు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చర్ల ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేసిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ఒక్కో రైతుకు 18 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆదివాసులను కించపరిచే విధంగా మాట్లాడిన చర్ల ఫారెస్టు రేంజరు ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఆ భూమికి ఇప్పుడు ఫారెస్ట్ వారొచ్చి ఈ భూమి ఫారెస్ట్ ది అని చెప్పడంలో అంతర్యం ఏమిటి దీని వెనక దాగున్న నిజాలు ఏమిటో చెప్పాలని వారు అన్నారు మరోపక్క ఎమ్మెల్యేలు మంత్రులు ఆదివాసులకి పోడు భూములకు పట్టాలిస్తామని ఓట్ల ముందు అనేక హామీలు ఇచ్చి నేడు ఆదివాసీల పంటలను ఫారెస్ట్ వారు విధ్వంసం చేస్తున్న కనీసం పట్టించుకోకపోవడం వీళ్ళ పనితనానికి నిదర్శమని ఆయన అన్నారు తక్షణమే ఆదివాసీల భూములను ఆదివాసులకు పంచాలని వారి భూమిలోకి ఫారెస్ట్ వారు రాకుండా చూడాలని ధ్వంసం చేసిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని ఆదివాసులను కించపరుస్తూ మాట్లాడిన ఫారెస్ట్ వారిపై కేసులు నమోదు చేయాలని సిపిఐ ఎ
ఎమ్ ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు