మల్లయ్య దర్శనం కోసం అడవి శాఖ అనుమతి.
అచ్చంపేట నేటి ధాత్రి:
బజరంగ్ దళ్ అచ్చంపేట ఆధ్వర్యంలో మంగళవారం నాగర్ కర్నూల్ DFO రోహిత్ గోపిరేడీని కలిసి తొలి ఏకాదశి పర్వదినాన లొద్ది మల్లయ్య దేవస్థాన దర్శన నిమిత్తం అటవీ అనుమతి కొరకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా భజరంగ్ దళ్ అచ్చంపేట సంయోజక్ శివ చంద్ర గౌడ్ మాట్లాడుతూ..ప్రతి ఏటా తొలి ఏకాదశి పర్వదినాన లొద్ది మల్లయ్య దేవస్థాన దర్శనం చేసుకోవడం ఈ ప్రాంత ప్రజల ఆనవాయితీ & సంప్రదాయంగా వస్తుంది, అందుకుగాను ఈ సంవత్సరం ఈనెల 6వ తేదీన తొలి ఏకాదశి పర్వదినాన సందర్భంగా లొద్ది మల్లయ్య దేవస్థానానికి దర్శనం నిమిత్తం అటవీ అనుమతులు ఇవ్వవలసిందిగా DFO రోహిత్ గోపిడి గారికి వినతి పత్రం అందించడం జరిగింది వారు సానుకూలంగా స్పందిస్తూ తొలి ఏకాదశి సందర్భంగా ఒకరోజు అనుమతి ఇస్తామని, ఈ ప్రాంత ప్రజలు లొద్ది మల్లయ్యను దర్శనం చేసుకోవచ్చని, పర్యాటకులకు అనుమతి లేదని, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అభయారణ్యంలో వెలసిన ఈ దేవస్థానానికి తగు జాగ్రత్తలు తీసుకొని, చెట్లను కొట్టకుండా & జంతువులకు హాని కలిగించకుండా దర్శనం చేసుకోవాల్సిందిగా వారు సూచించారు,అభయారణ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధం అని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు చందులాల్ చౌహాన్, శివాజీ నరేష్, తిరుపతి, అజయ్ కుమార్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.