Congress Pushes for Village Development Victory
గ్రామ స్వరాజ్యం కల నెరవేరాలంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలంలోని పిచారాగడి మరియు మాచిరెడ్డిపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జాహిరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా ఆయా గ్రామాల అభ్యర్థుల కొరకు ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.గ్రామాలు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో గెలిపించాలని అభ్యర్తించారు. అభ్యర్తులకు కేటాయించిన గుర్తులను గుర్తుంచుకొని తప్పకుండా అభ్యర్థులను ఆశర్వాదించాలని, మహిళలు చాలా కీలకమని, మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్ద పీఠం వేస్తుందని అన్నారు.ఈ కారిక్రమంలో మాచిరెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి అర్షద్ అలీ మరియు పిచారాగడి సర్పంచ్ అభ్యర్థి అమృత వీరా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
