
₹2 Lakh Donation for Temple
తుల్జాభవాని దేవాలయ అభివృద్ధికి
రూ.2,00,000 విరాళం.
ఆమనగల్/ నేటి ధాత్రి :
కల్వకుర్తి నియోజకవర్గంలోని
ఆమనగల్ మండలం రాంనుంతల గ్రామ పంచాయతీ,చిన్న తండాలో పర్యటించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నిర్మాణంలో ఉన్న తుల్జాభవానీ మాత దేవాలయాన్ని సందర్శించిన అనంతరం…గ్రామస్తుల కోరిక మేరకు ఆలయ అభివృద్ది తన వంతు సహకారంలో బాగంగా
రూ.2,00,000/- (రెండు లక్షలు)ల విరాళం గా ప్రకటించి, మొదటగా రూ,60,000/-(అరవై వేలు) చెక్ ను గ్రామస్తుల సమక్షంలో ఆలయ కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది..ఈ సందర్భంగా మాట్లాడుతూ..దేవాలయాల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని,దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలని,వాటిని సంరక్షించుకోవడం మన బాధ్యత అని తెలియజేశారు. గ్రామస్తులు,ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..తమ దేవాలయానికి చెప్పిన హామీకంటే కూడా పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నందుకు,ధన్యవాదాలు తెలుపుతూ,వారు అమ్మవారి ఆశీస్సులతో గొప్ప శిఖరాలను చేరుకోవాలని కోరుతూ,ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటామని తెలియజేశారు..ఈకార్యక్రమంలో…
మాజీ ఎంపీటీసీ సరిత పంతు నాయక్,మాజీ సర్పంచ్ రచ్చ శ్రీరాములు,జింత నాయక్, పీక్ల నాయక్, పరమేష్,బన్సిలాల్,శాంతి లాల్,నర్రా యాదయ్య, భాస్కర్ లతో తదితరులు పాల్గొన్నారు.