
development of students
విద్యార్థుల ఆలోచన శక్తి మేదస్సు అభివృద్ధి కోసం
స్వగ్రామ విద్య అభివృద్ధికి అంకితభావం…
కేసముద్రం,ఇనుగుర్తి హై స్కూల్స్ కి చెస్ బోర్డుల బహుకరణ
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మరియు ఇనుగుర్తి మండలాల విద్యార్థుల క్రీడా ప్రోత్సాహానికి అమెరికాలో నివాసముంటున్న వెంకటగిరి గ్రామానికి చెందిన ఎన్ ఆర్ ఐ గుజ్జ శ్రీనివాసరావు, ఆయన సతీమణి మంజుల దంపతులు విశేష సహకారం అందించారు. విద్యార్థుల ఆలోచనా శక్తి, మేధస్సు అభివృద్ధి కోసం మండలంలోని 14 ప్రభుత్వ హైస్కూల్స్కి ఒక్కొక్క పాఠశాలకు 6 చొప్పున చెస్ బోర్డులు బహుకరించారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు, బండారు నరేందర్, ధన్నసరి సింగిల్ విండో చైర్మన్ మర్రి రంగారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, బి ఆర్ ఎస్ నాయకులు నీలం దుర్గేశ్, గుగులోత్ వీరునాయక్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా పేర్కొన్నారు.
అమెరికాలో నివసిస్తూ స్వగ్రామ విద్యార్థుల అభివృద్ధికి అంకితభావంతో ముందుకు వస్తున్న గుజ్జ శ్రీనివాసరావు, మంజుల దంపతులు నిజమైన ఆదర్శ దాతలు అన్నారు.
చెస్ ఆట విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని, వ్యూహాత్మక ఆలోచనను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది అని దాత అభిప్రాయపడ్డారు.
స్వగ్రామ విద్యా అభివృద్ధికి అంకితభావంతో చేసిన గుజ్జ శ్రీనివాసరావు, మంజుల దంపతుల సహకారం కేసముద్రం మండల విద్యా రంగంలో చిరస్మరణీయంగా నిలుస్తుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.