చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు
చందుర్తి, నేటిధాత్రి:
*చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ ఆధ్వర్యంలో క్రీడాకారులతో కలిసి గురువారం… వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి.. నిధులు మంజూరు చేసినందుకుగాను శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు…అలాగే చందుర్తి మండల హెడ్ క్వార్టర్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు… గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రభుత్వం క్రీడల్లో ప్రోత్సహించాలని ,క్రీడలకు ప్రభుత్వం పెద్ద పీట వేయాలని చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ కోరారు.. మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు…
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు మహమ్మద్ జాకీర్, మహమ్మద్ అహ్మద్ పాషా, పిట్టల బాబు, నక్క యాకూబ్ ,వెంకటేష్,సుభాష్, హరిబాబు, రాంబాబు, పులి నరేష్, నక్క డిశి, తదితరులు పాల్గొన్నారు.