మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ కోసం..ప్రసవాంతర సేవలను సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి అన్నారు. ప్రతి గురువారం అమ్మ కోసం అనే కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలకు మరియు డెలివరీ తర్వాత ఒక సంవత్సరం లోపు ఉన్న మహిళలకు వైద్య చికిత్సలు చేసి వారు ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. గర్భిణీలు, బాలింతలు వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఏర్పడినట్లయితే ప్రతి గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు.