కార్మిక హక్కులకై శ్రామిక ప్రజలు మరింత పోరాటం చేయాలి

మే డే వేడుకల్లో హన్మకొండ జెఏసి చైర్మన్ తాడిశెట్టి క్రాంతి కుమార్

హసన్ పర్తి / నేటి ధాత్రి

మేడే సందర్భంగా హన్మకొండ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో తాడిశెట్టి క్రాంతి కుమార్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎర్రజెండా ఆవిష్కరణ చేసి కార్మికుల గురించి, మేడే విశిష్టత గురించి వివరించడం జరిగింది. ఈ దేశంలో కార్మికుల పక్షాన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ఎనిమిది గంటల పని విధానం పనికి తగ్గ ఫలితంగా జీతభత్యాలు ,పిఎఫ్ లు మరియు ఆరోగ్య బీమా ఇలా అన్ని హక్కులు ఇవ్వాలని కార్మికులకు వారి పిల్లలకు చదువుకునేందుకు ఉచిత విద్యను అందించాలని ఇవన్నీ డిమాండ్లను బిల్లులో చేర్చి అంబేద్కర్ ఆనాడే కార్మికుల పక్షాన నిలబడడం జరిగింది
అలాంటి భారతదేశంలో ఇప్పటివరకు కూడా కార్మికులకు కర్షకులకు న్యాయం జరగలేదని పనికి తగ్గ వేతనాలు ఇప్పటికీ అమలులోకి లేవని ఎనిమిది గంటల పని విధానం ఎప్పుడో పోయి కార్పొరేట్ సెక్టార్లన్నీ కూడా సామాన్యులతో 12 గంటలు 15 గంటలు కొన్ని సందర్భాల్లో 18 గంటలు కూడా పని చేయించుకుంటూ పనికి తగ్గ వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, మన హక్కులను కాలరాస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రపంచ దేశాల్లో లేనివారి మధ్య ఉన్న వారి మధ్య దోపిడి విధానం గురించి ప్రపంచ దేశాల్లో జరుగుతున్న దోపిడి గురించి పేద ప్రజల రక్తాన్ని పీడిస్తూ పన్నుల రూపంలో మనల్ని ఇంకా పేదరికంలో నెట్టివేయబడేలా చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల గురించి వివరిస్తూ ఇప్పటికైనా కార్మికులందరూ ఐక్యంగా మరోసారి ఉద్యమించి భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కార్మికుల హక్కులను మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలని కొత్త విధానాలను తీసుకురావాలని కొత్త చట్టాలని తెచ్చుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!