
Food Poisoning Scare in Medak Madrasa
మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ మదర్సాలో పుడ్ పాయిజన్ కలకలం..
రామాయంపేట సెప్టెంబర్ 22 నేటి ధాత్రి (మెదక్)
చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలోని మదర్సాలో పుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది.ఈ సంఘటనలో 10 మంది చిన్నారులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు.వెంటనే సమాచారం అందుకున్న అధికారులు వారిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఆసుపత్రిలో వైద్యులు,సిబ్బంది పర్యవేక్షణలో చిన్నారులు చికిత్స పొందుతూ,ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు సమాచారం.
మరో 25 మంది పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిని స్వయంగా సందర్శించారు.చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుని తగిన సూచనలు చేశారు.అనంతరం అయన మాట్లాడుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారులందరూ బాగానే ఉన్నారు.వైద్యులు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించి,సరైన వైద్యం అందిస్తున్నారు.
ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు పిల్లలకు ఎల్లప్పుడూ నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు కూడా వంటగదులు పరిశుభ్రంగా ఉంచుతూ,ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి అని స్పష్టం చేశారు.అదేవిధంగా ఆహారం విషయంలో నాణ్యత నిబంధనలు పాటించని హోటళ్లపై,రెస్టారెంట్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.అయన వెంట ఇంచార్జి డిఎంహెచ్వో సృజన,ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ లింబాద్రి,జిల్లా స్పెషల్ ఆఫీసర్ కోఆర్డినేటర్ శివ