Food Festival Held at Primary School
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ వేడుకలను ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పలు రకాల వంటకాలు, తినుబండారాలతో పాఠశాలకు విచ్చేసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ వైద్య వనజ మాట్లాడుతూ ఈ ఫెస్టివల్ వేడుకల్లో బాగంగా విద్యార్థులకు అందజేయాల్సిన పౌష్టికాహారంపై తల్లితండ్రులకు అవగాహన కల్పించామన్నారు. పౌష్టికాహారం లోపిస్తే విద్యార్థుల్లో ఎదుగుదల తగ్గిపోతుందని తెలిపారు. రకరకాల వంటకాలను పరిచయం చేసిన విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలుర పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు సరళ, మల్లీశ్వరి, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.
