చందుర్తి, నేటిధాత్రి:
అఖండ భారతావని ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం ఎన్నో ఉద్రిక్తతలు, ఘర్షణల మధ్య 500 ఏళ్ల నాటి నిరీక్షణ ఫలించి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య శ్రీరామ జన్మభూమి భవ్య మందిరం నిర్మాణ కల నెరవేరిన వేళ సోమవారం నాడు శ్రీ బాల రాముని విగ్రహ పునః ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని.. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది రామ భక్తులు ప్రతి హిందూ పండుగల్లాగా ఇంటిని , దేవాలయాలను పరిశుభ్రంగా చేసుకుని గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించారు. వాకిట్లో జైశ్రీరామ్ నినాదాలు రాసి అయోధ్య రామ మందిర నిర్మాణ ముగ్గులు వేసి రంగురంగులతో అలంకరించారు అనంతరం చందుర్తి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలతో పాటు మల్యాల గ్రామ హనుమాన్ దేవాలయంలో ముందు భాగంలో అయోధ్య శ్రీరామ మందిర ప్రతిమ పెట్టి పూజించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మండలంలోని ప్రతి హిందువు సాయంత్రం వేళ ఇంటి ముంగిట్లో 5 రామజ్యోతి లు వెలిగించి ఆ స్వామి ప్రార్థించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు మహిళలు యువకులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.